Sanjay Raut : దేశ రాజకీయాల్లో మార్పు ఖాయం
స్పష్టం చేసిన ఎంపీ సంజయ్ రౌత్
Sanjay Raut : శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్య సభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో ఆయనతో పాటు అడుగులో అడుగు వేశారు సంజయ్ రౌత్ . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సంజయ్ రౌత్. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్రతో దేశంలోని ప్రధాన రాజకీయాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని త్వరలోనే దాని ప్రభావం కనిపించడం ఖాయమన్నారు.
సంజయ్ రౌత్. రాహుల్ గాంధీని తన స్వరం పెంచే నాయకుడిగా చూస్తున్నానని అన్నారు. దేశ రాజకీయాలలో మార్పు ప్రారంభమైందని అన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారని కితాబు ఇచ్చారు.
గత కొంత కాలంగా పనిగట్టుకుని భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు రాహుల్ ను పప్పు అని దుమ్మెత్తి పోశాయని కానీ ఆయన అందివచ్చిన అద్భుతమైన నాయకుడని అర్థం చేసుకోవడం లేదన్నారు.
గత 11 నెలలుగా కాశ్మీరీ పండిట్లు తమను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారని వారికి తాము సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నామని స్పష్టం చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut).
ఇంత జరుగుతున్నా కేంద్ర సర్కార్ స్పందించడం లేదని మండిపడ్డారు. ఏది ఏమైనా తమకు అధికారం కంటే దేశంలోని ప్రజలందరినీ ఒకే చోటుకు చేర్చడం ముఖ్యమన్నారు శివసేన నాయకుడు.
ఇదిలా ఉండగా జమ్మూ లో వర్షం కురుస్తున్నా రాహుల్ గాంధీ, సంజయ్ రౌత్ కలిసి ప్రజల కోసం నడిచారని ఇది చరిత్రాత్మకంగా నిలిచి పోతుందని పేర్కొంది సామ్నా పత్రిక.
Also Read : రాహుల్ తో జతకట్టిన సంజయ్ రౌత్