Sanjay Raut : శివసేన బాల్ థాకరే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం కొలువు తీరిన షిండే, బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇది మూణ్ణాళ్ల ముచ్చటేనని కొట్టి పారేశారు. రాబోయే 15 లేదా 20 రోజుల్లో షిండే సర్కార్ కూలి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడవని చెప్పారు. ఆదివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తోందని చెప్పారు. న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. గతంలో ఫిబ్రవరిలో షిండే ప్రభుత్వం నిలబడని సంజయ్ రౌత్(Sanjay Raut) ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది.
ఉద్దవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై (షిండే పార్టీకి చెందిన ) అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ తో సహా అనేక పిటిషన్లపై పెండింగగ్ లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పును రాజ్యసభ సభ్యుడు రౌత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం ఉన్న సీఎం షిండే, ఆయన తరపు 40 మంది ఎమ్మెల్యేల సర్కార్ కొన్ని రోజుల్లో కూలి పోయేందుకు సిద్దంగా ఉందన్నారు.
Also Read : బొమ్మైపై భగ్గుమన్న సిద్దరామయ్య
