Sanjay Raut : దీదీ ఆహ్వానం ఉద్దవ్ ఠాక్రే దూరం
22 మందికి సీఎం ప్రత్యేక ఆహ్వానం
Sanjay Raut : దేశ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
ఈ సందర్భంగా ఆమె ఎన్డీయే నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలని కోరారు. ఈ మేరకు దేశంలోని 22 మంది సీఎంలు, నేతలకు లేఖలు రాశారు.
వారిలో కేసీఆర్, ఎంకే స్టాలిన్ , ఉద్దవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్ , పినరయ్ విజయన్ , సోరేన్ , తదితరులకు ఇప్పటికే లేఖలు అందాయి.
ఇదిలా ఉండగా ఈనెల 15న ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు రావాలని కోరుతూ కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాందీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కూడా ఆహ్వానించారు మమతా బెనర్జీ(Mamatha Banerjee).
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి అభ్యర్థిని బరిలో ఉంచాలని కోరుకుంటోంది. ఇక బీజేపీ వెంకయ్య నాయుడు, తమళిసై, రాజ్ నాథ్ సింగ్ , తదితరులను పరిశీలిస్తోంది ప్రెసిడెంట్ పదవి కోసం.
ఈ తరుణంలో ఉద్దవ్ ఠాక్రే హాజరు కాక పోవడంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) . మమతా బెనర్జీ సమావేశానికి రమ్మని పిలిచారు.
కానీ మా పార్టీ చీఫ్, సీఎం ఠాక్రే ఆరోజు రావడం లేదు. ఎందుకంటే ఆయన అయోధ్యలో ఉంటారని చెప్పారు.
Also Read : ఏకమవుదాం ఎన్డీఏ అభ్యర్థిని ఓడిద్దాం