Sanjay Raut : హిందీ భాషను గౌరవించండి
స్పష్టం చేసిన సంజయ్ రౌత్
Sanjay Raut : నిన్నటి దాకా కేంద్ర సర్కార్ పై ప్రధానంగా మోదీ, అమిత్ షాపై నిప్పులు చెరుగుతూ వచ్చిన శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్వరం మార్చారు.
గత కొంత కాలంగా ఒకే దేశం ఒకే పౌరసత్వం ఒకే భాష నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి దేశ వ్యాప్తంగా.
ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య, హెచ్ డి కుమార స్వామితో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం అమిత్ షాపై నిప్పులు చెరిగారు.
భాష పేరుతో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో తమిళనాడు విద్యా శాఖ మంత్రి పొన్ముడి భారతీయార్ యూనివర్శిటీ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశంలో హిందీ మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. అంతే దానిని మాట్లాడుతున్న వాళ్లంతా ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా పానిపూరీ అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇంకోసారి హిందీ భాష మాట్లాడాలంటూ చెబితే తమిళనాడు భగ్గుమంటదని హెచ్చరించారు. ఈ తరుణంలో విద్యా శాఖ మంత్రి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.
ఈ తరుణంలో అమిత్ షాకు మద్దతుగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) నిలిచారు. తాను హిందీనే మాట్లాడతానని, పార్లమెంట్ లో దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పారు.
హిందీ భాషను గౌరవించాలని , దీనిని అమలు చేసేందుకు అమిత్ షా ట్రై చేయాలని సూచించారు సంజయ్ రౌత్.
Also Read : భారీ భద్రత మధ్య జ్ఞాన్ వాపి మసీదు సర్వే