Sanjay Raut : సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
మరాఠా యోధుడికి నివాళి
Sanjay Raut : శివసేన మౌత్ పీస్ గా పేరొందిన ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ మరాఠాలో ప్రభుత్వం అన్నది లేదన్నారు. కేవలం ఒకే ఒక్కడు దేవేంద్ర ఫడ్నవిస్ నడుపుతున్నట్లు తనకు అనిపిస్తోందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ తో పాటు ప్రవీణ్ రౌత్ ను 102 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది ఇద్దరికీ . జైలు నుంచి వచ్చాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఏ సందర్భంలో తాను డిప్యూటీ సీఎంను కలుస్తానని చెప్పానో మీకు తెలియదన్నారు.
మరాఠా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రభుత్వం సరిగా నడవాల్సిన అవసరం ఉందన్నారు సంజయ్ రౌత్. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమేనని పేర్కొన్నారు. ఆయన నేరుగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నివాసం వద్దకు వెళ్లారు. అక్కడ దివంగత మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రేకు నివాళులు అర్పించారు.
ప్రాణం ఉన్నంత వరకు ఆ యోధుడి అనుచరుడిగానే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut). ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. ప్రస్తుతం ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ విషయాన్ని నేను వార్తా పత్రికల్లో చూశానని చెప్పారు. మంచిని గుర్తిస్తాం. కానీ ఇదే సమయంలో చెడును, ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని తప్పకుండా ఎండ గడతామని హెచ్చరించారు సంజయ్ రౌత్.
Also Read : భారత్ ఓటమి గురించి పట్టించు కోవద్దు