Sanjay Raut : మేం షిండే సర్కార్ ను కూల్చం – రౌత్
షిండే సర్కార్ పై సంజయ్ రౌత్ కామెంట్స్
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లో షిండే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టబోమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నారు. గత పది రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలు అర్థం చేసుకున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో వాళ్లే నిర్ణయిస్తారు ఎవరు సమర్థులో. ఎవరు ప్రజా పక్షం వైపు ఉన్నారనేది.
ఇంతకంటే ఎక్కువ చెప్పాలేనని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుందని భావిస్తోంది. మేం అలాంటి పని చేయదల్చు కోలేదన్నారు. తమ సంస్కృతి అది కాదన్నారు.
శివసేన పార్టీ అధికారం కోసం ఆవిర్భవించ లేదని, అధికారమే దాని కోసం పుట్టిందన్నారు. మరోసారి ఇదే స్పష్టం చేస్తున్నా. ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారో, ఇంకెవరు నిరాధారమైన ఆరోపణలు చేశారో వాళ్లకు బాగా తెలుసన్నారు సంజయ్ రౌత్.
ఇవాళ ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన రోజు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేస్తామని భారతీయ జనతా పార్టీ శపథం చేసిందని ఆరోపించారు.
అయితే తమ శివసేన పార్టీ అలాంటి పని ఎప్పుడూ చేయదన్నారు. 39 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినంత మాత్రాన తమ పార్టీ బలహీనం కాబోదని చెప్పారు సంజయ్ రౌత్.
వాళ్లు వెళ్లినా తాము ఏమీ బాధ పడటం లేదన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ఉద్దవ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే షాక్