Sanjay Raut : మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న హింసపై శివసేన ఎంపీ , ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దేశం చిన్నా భిన్నం అయినా పర్వా లేదు. కానీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
శివసేన అధికార పార్టీ పత్రిక సామ్నాకు సంజయ్ రౌత్ (Sanjay Raut) ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. శ్రీరాముడి పేరుతో మత మంటలు చెలరేగడం రాముడి ఆలోచనకే అవమానకరమని పేర్కొన్నారు.
మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణాలను చూసి పైన ఉన్న శ్రీరాముడి ఆత్మ ఘోషిస్తూ ఉంటుందన్నారు శివసేన ఎంపీ.
ఆదివారం సంజయ్ రౌత్ (Sanjay Raut)మీడియాతో మాట్లాడారు. అక్కడ శ్రీరామ నవమి సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు కర్ఫ్యూ విధించేందుకు కారణమయయాయి.
ఇదే సమయంలో సామ్నాలో ఆయన తన వారపు కాలమ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రయత్నం చేస్తారు.
కానీ గత కొంత కాలంగా ఈ దేశంలో అలాంటి వాతావరణం లేకుండా పోయింది. మతం పేరుతో ఓట్లను ప్రభావితం చేసే, చీల్చే పని జరుగుతోందని ఆరోపించారు సంజయ్ రౌత్. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇంతకు ముందు శ్రీరామ నవమి అంటే ఊరేగింపులు, సంస్కృతి, మతానికి సంబంధించేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు రౌత్.
Also Read : ఊరేగింపుపై రాళ్ల దాడి 14 మంది అరెస్ట్