Sanjay Raut : ఈసీ సహకారం బీజేపీ విజయం – రౌత్
శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ
Sanjay Raut : మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఆరు సీట్లకు ఎన్నికలు జరిగితే 3 సీట్లను కైవసం చేసుకుంది. మరో మూడు అధికార మహా వికాస్ అఘాడీకి దక్కాయి.
కాగా ఆరో సీటు శివసేన పార్టీకి చెందిన అభ్యర్థి సంజయ్ పవార్ ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన కామెంట్స్ చేశారు.
మరాఠాలో శివసేన పతనం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో బీజేపీకి ఇలాంటి ఫలితాలే రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
దీంతో ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తాజా ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన సంజయ్ రౌత్.
కేంద్ర ఎన్నికల సంఘం సహకారం వల్లనే బీజేపీ ఇక్కడ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన ప్రపంచాన్ని గెలిచినట్లు కాదని ఎద్దేవా చేశారు.
పూర్తిగా ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి చేసి , క్రాస్ ఓటింగ్ కు పాల్పడే బీజేపీ చేసిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.
మరాఠా నుంచి శివసేన పార్టీ తరపున బలమైన గొంతుకగా ఉన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut). ఆయన భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా లను టార్గెట్ చేస్తూ వచ్చారు.
Also Read : శివసేన పతనం ప్రారంభం – ఫడ్నవిస్