Sanjay Raut : భారతీయ జనతా పార్టీకి శివసేన పార్టీలకు మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి రాణేపై నిప్పులు చెరిగాడు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్.
రాణే కుటుంబం, శివ సేన జాతకం తన వద్ద ఉందంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అంతే కాదు ఏ ఒక్కరినీ విడిచి పెట్టమంటూ ఫైర్ అయ్యారు. మరాఠా సీఎం మాతోశ్రీలో ఉన్న నలుగురు వ్యక్తుల కోసం ఈడీ సిద్దంగగా ఉందంటూ పేర్కొన్నాడు.
అంతే కాదు నోటీసులు సిద్దంగా ఉన్నాయని హెచ్చరించాడు. దీనిపై ఇవాళ సీరియస్ గా స్పందించారు సంజయ్ రౌత్(Sanjay Raut ). తీవ్రంగా హెచ్చరించారు రాణెను. ఇలాంటి బెదిరింపులను, నోటీసులను, కేంద్ర దర్యాప్తు సంస్థలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
అయితే కేంద్ర మంత్రివి అయితే అయి ఉండవచ్చు గాక. రాణే నీ జాతకం, నీ కథేంటో నా వద్ద ఉన్నాయని స్పష్టం చేశాడు సంజయ్ రౌత్.
నీకు ఇంకా తెలియదేమో..ఇది మరాఠా అన్నది మరిచి పోతే ఎలా. మోదీ , ఆయన పరివారానికి భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఏ మాత్రం తమ వద్దకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు సంజయ్ రౌత్.
ఒక వేళ ఏమైనా కుంభకోణాలకు పాల్పడితే వాటికి సంబంధించిన ఆధారాలు, పత్రాలను కేంద్ర ఏజెన్సీలకు ఇవ్వాలని సవాల్ విసిరారు.
రాణేతో పాటు బీజేపీ మాజీ ఎంపీ సోమయ్య కుంభకోణాలను బయట పెడతామంటూ హెచ్చరించారు సంజయ్ రౌత్. పోవాయ్ లోని పెరూ బాగ్ లో మురికి వాడల పునారావాస ప్రాజెక్టు ద్వారా సోమయ్య రూ. 300 కోట్లకు పైగా దోపిడీని చేశారని ఆరోపించారు.
Also Read : ముదిరిన వివాదం తప్పని ఆగ్రహం