Sanjay Raut : ఈడీని అప్పగిస్తే ఫడ్నవిస్ ఓటు మాకే
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరు సీట్లకు గాను మూడు సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందగా మరో మూడు సీట్లను మహా వికాస్ అఘాడీ (ఎంవిఏ) చేజిక్కించుకుంది.
విచిత్రం ఏమిటంటే ఆరో సీటును శివ సేన అభ్యర్థి సంజయ్ పవార్ కోల్పోయారు. ఇది కోలుకోలేని దెబ్బ శివసేన సంకీర్ణ సర్కార్ కు. ఈ తరుణంలో తాము ఈ రిజల్ట్స్ గురించి పట్టించు కోబోమన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut).
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ , మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై నిప్పులు చెరిగారు. సంచలన కామెంట్స్ చేశారు.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారంగా ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఒకవేళ మోదీ ఈడీని గనుక తమ ప్రభుత్వానికి అప్పగిస్తే నోరు పారేసుకుంటున్న ఫడ్నవిస్ కూడా శివసేన పార్టీకి వద్దన్నా ఓటు వేస్తారని అన్నారు.
సంజయ్ రౌత్ చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిన్న పార్టీలను కావాలని మోదీ త్రయం ( మోదీ, అమిత్ చంద్ర షా, జేపీ నడ్డా ) ఒత్తిళ్లకు గురి చేస్తోందని ఆరోపించారు.
కేంద్ర ఏజెన్సీల నిర్వాకం వల్లే తమ అభ్యర్థి ఓడి పోయారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సంజయ్ రౌత్(Sanjay Raut). ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేశారంటూ మండిపడ్డారు.
Also Read : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ