Sanjay Raut Shivsena Symbol : పార్టీ గుర్తు వెనుక కేంద్రం కుట్ర – రౌత్
ఢిల్లీలోనే స్కెచ్ వేశారంటూ ఆరోపణ
Sanjay Raut Shivsena Symbol : శివసేన పార్టీ గుర్తు వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. బాల్ సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీకి సంబంధించిన విల్లు, బాణం గుర్తును శివసేనలో తిరుగుబాటు జెండాను ఎగుర వేసిన సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఇది పూర్తిగా కక్ష సాధింపు తో చేసిన చర్యగా అభివర్ణించారు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు తుది తీర్పు వెలువడలేదు. కానీ ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై నిప్పులు చెరిగారు. శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. పార్టీ గుర్తు కేటాయింపు వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆరోపించారు. అంతే కాదు రూ. 2,000 కోట్ల డీల్ కుదిరిందని, దీని గురించి తాను త్వరలో ఆధారాలు బయట పెడతానంటూ సంచలన కామెంట్స్ చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut Shivsena Symbol) .
తమ పార్టీకి చెందిన విల్లు..బాణం గుర్తును కేటాయించడం వెనుక పెద్ద మతలబు దాగి ఉందన్నారు. ఎందుకంటే త్వరలో దేశంలోనే అతి పెద్ద కార్పొరేషన్ అయిన బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే నగర వాసులను కన్ ఫ్యూస్ చేయడంలో భాగంగానే గుర్తును కేటాయించారంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు సంజయ్ రౌత్. ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని తుది తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని స్పషట్ం చేశారు ఎంపీ.
Also Read : ఇక శివ సైనికులు ఊరుకోరు – ఠాక్రే