Sanjay Raut Modi : మోదీ అదానీపై ప్రేమ ఎందుకు – శివసేన
నిలదీసిన ఎంపీ సంజయ్ రౌత్ ..బాయ్ కాట్
Sanjay Raut Modi : దేశ వ్యాప్తంగా అదానీ గ్రూప్ స్కాం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింప చేసింది. ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. ప్రధానమంత్రికి బిలియనీర్ అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలియ చేయాలని డిమాండ్ చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) .
అదానీ గ్రూప్ వ్యవహారం పై ఎందుకు నోరు మెదపడం లేదంటూ నిలదీశారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలన్నారు. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు వెల్ ఆఫ్ హౌస్ లోకి దూసుకు వెళ్లడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు సంజయ్ రౌత్. ఈ మొత్తం స్కాంకు సూత్రధారులు ఎవరో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేఏసీ) తో విచారణ చేపట్టాలని లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని కోరారు. అప్పటి వరకు తాము ఊరుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు సంజయ్ రౌత్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బహిష్కరించాలని శివసేన యుబిటీ పార్టీ నిర్ణయించినట్లు ఎంపీ వెల్లడించారు.
యావత్ ప్రపంచమంతా దీనిపై విచారణ చేపట్టాలని కోరుతుంటే బీజేపీ దాని అనుబంధ సంస్థలు మాత్రం మౌనంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut) . మరో ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా జేఏసీని ఏర్పాటు చేయాలని కోరారు. తమ పార్టీ బేషరతుగా కోరుతోందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో జేఏసీ విచారణపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
Also Read : పార్లమెంట్ లో ఎల్ఐసీ..ఎస్బీఐపై రచ్చ