Sanjay Raut : శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి కేంద్రంపై విరుచుకు పడ్డారు. ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు. ఇప్పటికే ఉప్పు నిప్పు లాగా తయారైంది బీజేపీ, శివసేన పార్టీల మధ్య.
శివసేన సంకీర్ణ ప్రభుత్వం మహా వికాస్ అగాధీని ఎలాగైనా సరే దించేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. దీనిపై శివసేన ఏ మాత్రం తగ్గడం లేదు.
తమ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు తెగ బడినా తట్టుకుని నిలబడింది సర్కార్. ఇదే సమయంలో తన మాటల తూటాలను పేల్చుతూనే ఉన్నారు ఆ పార్టీ తరపున సంజయ్ రౌత్(Sanjay Raut).
బీజేపీ దేశంలో ఎక్కడైనా భయపెట్ట గలదు. కానీ పులి లాంటి శివసేనతో పెట్టుకుంటే తట్టుకోవడం కష్టమన్నారు ఈ మధ్య. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సంజయ్ రౌత్ స్పందించారు.
ఆయన సంచలన కామెంట్స్ చేశారు. యూపీలో కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ గెలుపొందేందుకు సహకరించాని ఆరోపించారు. ఇందుకు బీఎస్పీ చీఫ్ మాయావతి ఉదాహరణి అని పేర్కొన్నారు.
గతంలో యూపీలో పాలన సాగించారు. పులిలా ఉన్నారు. కానీ మోదీ త్రయం ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చారు. చివరకు పిల్లిలా మార్చేశారు. బీఎస్పీని రాష్ట్రంలో పోటీ చేయనీయకుండా అడ్డు పడ్డారంటూ మండిపడ్డారు.
పాత కేసులను చూపిస్తూ బీఎస్పీ చీఫ్ ను భయ పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీఎస్పీకి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడేలా చేశాయంటూ ఆగ్రహం చెందారు.
Also Read : భగవంత్ మాన్ సంచలన నిర్ణయం