Sanjay Singh Sisodia : కేంద్రం చిల్లర రాజకీయం – సంజయ్
మనీష్ సిసోడియా అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం
Sanjay Singh Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ విచారణ జరిపిన అనంతరం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. ఈ మొత్తం ఘటన ఆప్ లో కలకలం రేపింది. ఆప్ కు చెందిన యూపీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొన్నారు. విచారణలో భాగంగా 10 గంటలకు పైగా ప్రశ్నించింది. కావాలలని కేంద్రం ఆప్ ను ఎదగనీయకుండా చేస్తోందంటూ ఆరోపించారు సంజయ్ సింగ్(Sanjay Singh Sisodia).
మోదీ ప్రభుత్వానికి మూడిందని , కేంద్రం చిల్లర రాజకీయాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని అన్నారు. మనీష్ సిసోడియా ఏం తప్పు చేశాడని అదుపులోకి తీసుకున్నారంటూ ప్రశ్నించారు. సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తాము ఎదుర్కొంటామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్సైజ్ పాలసీలు లేవా అని నిలదీశారు. వాటి మీద కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 34 మందిపై కేసు నమోదు చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సీబీఐ కోర్టుకు సమర్పించిన రెండో నివేదికలో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా చేర్చింది. అంటే కేంద్రం ప్లాన్ లో భాగంగా ఆ ఇద్దరినీ అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఆప్ , తెలంగాణలో టీఆర్ఎస్ ఖతం అవుతాయని భావిస్తున్నట్లు సమాచారం. సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన సంజయ్ సింగ్ ను (Sanjay Singh) పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : సుదీర్ఘ విచారణ..సిసోడియా అరెస్ట్