Sanju Samson IPL 2022 : టైటిల్ కు అడుగు దూరంలో శాంస‌న్

స‌మిష్టిగా రాణిస్తేనే విజ‌యం లేదంటే క‌ష్టం

Sanju Samson IPL 2022 : 14 ఏళ్ల త‌ర్వాత రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ 2022 టైటిల్ కోసం ఫైన‌ల్ కు అడుగు పెట్టింది. కేవ‌లం అడుగు దూరంలో ఉంది ఆ జ‌ట్టు. ఇక సంజూ శాంస‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

మోస్ట్ డేంజ‌ర‌స్ స్టార్ హిట్ట‌ర్ క్రికెట‌ర్ గా పేరొందాడు. గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో వ్య‌క్తిగ‌త స్కోర్ లో టాప్ 5లో ఉన్న సంజూ శాంస‌న్ ఈసారి ఆశించినంత‌గా రాణించ లేదు. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టును ఎక్కువ‌గా క‌ల‌వ‌ర ప‌రుస్తోంది.

అన‌వ‌స‌ర షాట్స్ కు వెళ్లి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. కెప్టెన్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టాల్సిన శాంస‌న్ కు ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ ఫైన‌ల్ మ్యాచ్ కీల‌కం కానుంది.

టైటిల్ గెలవాలంటే జైశ్వాల్, జోస్ బ‌ట్ల‌ర్ , ప‌డిక్క‌ల్ , రియాన్ ప‌రాగ్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , సిమ్రోన్ హిట్ మైర్ గ‌నుక రాణిస్తే ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయం.

ఒక వేళ జోస్ బ‌ట్ల‌ర్ గ‌నుక రాణిస్తే అద‌న‌పు బ‌లంగా మార‌నుంది. 2008లో దివంగ‌త క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్ సార‌థ్యంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ టైటిల్ గెలుపొందింది.

ఆనాటి నుంచి 14 ఏళ్లు ప‌ట్టింది ఆ జ‌ట్టుకు ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరింది. ఈసారి ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగింది. ఎలాగైనా స‌రే ఈసారి క‌ప్పు ఎగ‌రేసుకు పోవాల‌ని డిసైడ్ అయ్యాడు శాంస‌న్.

ఇంట్రావ‌ర్ట్ తో పాటు మిస్ట‌ర్ కూల్ గా పేరొందారు సంజూ శాంస‌న్(Sanju Samson IPL 2022). మ్యాచ్ ప‌రంగా చూస్తే బ్యాటింగ్ లో దుర్బేద్యంగా ఉంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ . మొత్తంగా ఈ మ్యాచ్ మాత్రం ఉత్కంఠ‌ను రేపుతోంది.

Also Read : ఆల్ రౌండ్ నైపుణ్యం అద్భుత విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!