న్యూఢిల్లీ : భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలవడం పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. తను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. తను మామూలు ఆటగాడు కాదని, వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. తనలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే తిరిగి ఛాన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పాడు. తను ఏనాడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడిన దాఖలాలు లేవన్నాడు. అందుకే తనకు అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చినట్లు తెలిపాడు గంభీర్. ప్రతి ఆటగాడికి ఒక్కోసారి గడ్డు సమయం వస్తుందని, దానిని కవర్ చేసుకోగలిగితే ఆ తర్వాత రెచ్చి పోవడం ఖాయమన్నాడు.
ఇదే సంజు శాంసన్ విషయంలో నిరూపితమైందని పేర్కొన్నాడు హెడ్ కోచ్. పొట్టి ఫార్మాట్ లో మూడు సెంచరీలు చేసిన చరిత్ర తనది, ఇదే క్రమంలో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సీరీస్ లో అవకాశం ఇచ్చాం. కానీ అనుకోకుండా తను చెత్త షాట్స్ ఆడి పెవిలియన్ దారి పట్టాడు. అందుకే కొంత విరామం కావాలని పక్కన పెట్టడం జరిగిందని అన్నాడు గంభీర్. అంతే తప్పా కావాలని తనను తొలగించ లేదని వివరణ ఇచ్చాడు. సౌతాఫ్రికా తో ఓడి పోయాక కుడి, ఎడమల కాంబినేషన్ అవసరమని భావించామని, దీంతో తనకు సరైన ఆటగాడు సంజు శాంసన్ మాత్రమేనని తేలి పోయిందన్నాడు. తను నమీబియా, జింబాబ్వేతో పాటు కీలకమైన క్వార్టర్ ఫైనల్ , సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లలో సత్తా చాటాడని, ఇవాళ నేషనల్ హీరో అయ్యాడని కితాబు ఇచ్చాడు గంభీర్.
