Sanju Samson : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2022 లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో గెలుస్తామని అనుకున్న రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్(Sanju Samson) స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఎందుకు ఓడి పోయామో తెలియడం లేదన్నాడు.
దీనికి వేరే కారణాలు తనకు కనిపించడం లేదన్నాడు. ఒక రకంగా నిరాశను వ్యక్తం చేశాడు శాంసన్. దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయ తీరాలకు చేర్చారు.
దీంతో ఆర్సీబీ రాజస్థాన్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాము ఓటమికి ఇతర సాకులు లేదా కారణాలు నేను చెప్పేందుకు ఇష్ట పడడం లేదు.
ఎందుకంటే టాస్ ఓడి పోయాక ఇంత స్లో వికెట్ లో ఆ స్కోర్ చేయడం అన్నది మామూలు విషయం కాదన్నాడు సంజూ శాంసన్(Sanju Samson) . ప్లేయర్లు జోష్ బట్లర్ , హెట్మెయిర్ అద్భుతంగా రాణించారని పేర్కొన్నాడు.
మంచుతో కూడిన ఆఖరు ఓవర్ లో కూడా తాము పరుగులు చేయగలిగామని చెప్పాడు. నేను ఈ విషయం గురించి ప్రత్యేకంగా అంపైర్లతో చర్చించ లేదన్నాడు.
తమ జట్టు బౌలర్ల సత్తా ఏమిటో తెలుసన్నాడు. రాబోయే మ్యాచ్ లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతామని, మిగతా ఆటగాళ్లు కూడా గమనించాలని సూచించాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ .
ఇదిలా ఉండగా రాజస్థాన్ మూడు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి ఒకటి ఓడి పోయింది. సేమ్ ఆర్సీబీ కూడా అంతే.
Also Read : నమ్మకాన్ని వమ్ము చేయలేదు