Sarakaru Vaari Paata : ప్రిన్స్ మ‌హేష్ బాబు లుక్ అదుర్స్

స‌ర్కార్ వారి పాట మూవీ అప్ డేట్

Sarakaru Vaari Paata  : శుభ కృత్ ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్రిన్స్ మ‌హేష్ బాబు , కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన స‌ర్కార్ వారి పాట (Sarakaru Vaari Paata )మూవీ అప్ డేట్ వ‌చ్చింది. మూవీ మేక‌ర్స్ హీరో మ‌హేష్ బాబుకు సంబంధించిన న్యూ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా అద్భుత‌మైన క్యాప్ష‌న్ కూడా జ‌త చేశారు. ఈ న్యూ ఇయ‌ర్ కు మాస్ కొత్త లుక్ జోష్ తో లుక్కేయండి అంటూ పేర్కొన్నారు. ఇది విడుద‌లైన కొద్ది సేప‌ట్లోనే వైర‌ల్ గా మార‌డం విశేషం.

గ‌తంలో విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్స్ కంటే భిన్నంగా ఉంది ఇవాళ విడుద‌ల చేసిన లుక్. రోజు రోజుకు హీరోలు వ‌య‌సు ఎక్కువ‌గా అనిపిస్తుంటే మ‌హేష్ బాబు మాత్రం అందుకు భిన్నంగా మ‌రీ యంగ్ గా క‌నిపిస్తూ వ‌స్తున్నారు.

గీత గోవిందం తో స‌క్సెస్ సాధించిన ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ వారి పాట(Sarakaru Vaari Paata )వ‌స్తోంది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఎస్ఎస్ థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన లుక్ ను చూసి ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల‌వుతున్నారు. వెన్నెల కిషోర్ కూడా ఇందులో ఉండ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.

ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ , జీఎంబీ ఎంట‌రైన్మెంట్ , 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ ల‌పై న‌వీన్ యెర్నీని, ర‌విశంక‌ర్ , రామ్ అచంట‌, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. వ‌చ్చే నెల మే 12న విడుద‌ల‌కు సిద్దం అవుతోంది స‌ర్కార్ వారి పాటి.

Also Read : న‌ట దిగ్గ‌జం జిమ్ క్యారీ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!