Sarkaru Vaari Paata Song : క‌ళావ‌తి పాట ప్రొమో అదుర్స్

స‌ర్కారు వారి పాటపై భారీ అంచ‌నా

Sarkaru Vaari Paata Song : ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, ల‌వ్లీ గ‌ర్ల్ కీర్తి సురేష్ క‌లిసి న‌టించిన స‌ర్కారు వారి పాట‌కు (Sarkaru Vaari Paata Song)సంబంధించిన సాంగ్ ప్రోమో కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీకి సంబంధించి ప‌లు పోస్ట‌ర్లు రిలీజ్ చేశారు.

ప్ర‌తి పోస్ట‌ర్ కు మంచి మార్కులే ప‌డ్డాయి. దీంతో సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో మ‌హేష్ బాబును స‌రికొత్త కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌తో తీసిన గీత గోవిందం మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

స‌రికొత్త లుక్ తో ఆక‌ట్టుకునేలా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లిరిక‌ల్ క‌ళావ‌తి పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే డిక్లేర్ చేసింది మూవీ మేక‌ర్స్ .

ప్రిన్స్ ఫ్యాన్స్ కు మ‌రింత జోష్ పెంచేలా స‌ర్కారు వారి పాట(Sarkaru Vaari Paata Song) కు సంబంధించి స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక సినిమాకు సంబంధించి క‌ళావ‌తి పాట ప్రోమో రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన కొద్ది సేప‌ట్లోనే మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

వందో..ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన సాంగ్ ను అనంత్ శ్రీ‌రామ్ రాయ‌గా సిద్ శ్రీ‌రామ్ ఆలాపించారు.

ఇందులో మ‌హేష్ బాబు మ‌రింత అంద‌గాడిగాలా క‌నిపించాడు. స‌ర్కార్ వారి పాట మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్లు అనిపిస్తోంది.

ఏది ఏమైనా ప‌ర్ ఫెక్ట్ టైమింగ్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డే ప్రిన్స్ మ‌రింత ఆనందాన్ని పంచేలా చేశాడు ద‌ర్శ‌కుడు.

Also Read : నెట్టింట్లో ‘బ‌ధాయి దో’ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!