Satabdi Roy : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరిగి పోయింది.
అపారమైన వనరులు ఉన్నా ఈరోజు వరకు వాటిని ఉపయోగించుకునే సామర్థ్యం ఉన్నా పట్టించు కోవడం లేదు. పొద్దస్తమానం చైనాను దూషిస్తున్నాం. కానీ కొద్ది కాలంలోనే ప్రపంచ మార్కెట్ ను ఆ దేశం శాసించే స్థాయికి చేరుకుంది.
మొత్తం మార్కెట్ లో అన్ని వస్తువులను తయారు చేస్తోంది. గణనీయమైన ఆదాయాన్ని గడిస్తూ అమెరికా పక్కలో బల్లెంలా తయారైంది.
మరి ఈరోజు వరకు ఈ దేశంలో హిందూయిజం పేరుతో ఓట్లను కొల్లగొడుతున్న మోదీ ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటూ ఊదర గొడుతోంది.
ఇప్పటి వరకు దేశానికి సంబంధించిన బ్రాండ్లు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు విపక్షాలకు చెందిన సభ్యులు. ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా లీజుకు లేదా అమ్మకానికి పెట్టారు.
వాస్తవానికి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ 135 కోట్ల భారతీయులకు ప్రతినిధిగా ఉండడం లేదు. కేవలం ఇద్దరు లేదా నలుగురు బడా వ్యాపారవేత్తలకు మాత్రమే పని చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు డీఎంకే ఎంపీ కనిమొళి.
కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే రేపో మాపో రైల్వేను కూడా ప్రైవేట్ పరం చేసేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేతో పాటు ఎల్ఐసీలోకి పీపీలను ఆకర్షించడమే ప్రభుత్వ విధానమంటూ ఆరోపించారు. టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్(Satabdi Roy) సైతం మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
Also Read : భగత్ సింగ్ ఊరులో భగవంత్ ప్రమాణం