Satya Nadella : జాబ్స్ క‌ట్ వేత‌నాల‌పై వేటు – స‌త్య నాదెళ్ల‌

జీతాల పెంపును పెంచేది లేదన్న‌ సిఇఓ

ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల బిగ్ షాక్ ఇచ్చారు. ఉద్యోగుల‌ను తీసి వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆపై వేత‌నాలు పెంచేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తాజాగా 10,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 10 వేల మందిని సాగ‌నంపింది. మ‌రో వైపు కాస్ట్ క‌టింగ్ లో భాగంగా మ‌రో 10,000 మందిని తొల‌గించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సిఇఓ స‌త్య నాదెళ్ల‌. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ , గూగుల్ , ఫేస్ బుక్ , త‌దిత‌ర దిగ్గ‌జ సంస్థ‌ల‌లో వేలాది మందిని సాగ‌నంపాయి. ఇక అమెజాన్ లో 20,000 మందికి చెక్ పెట్టింది. ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్న వెంట‌నే ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం స్టార్ట్ చేశాడు. ఇప్ప‌టి దాకా 12,000 జాబ‌ర్సను సాగ‌నంపాడు. తొలుత దీనికి శ్రీ‌కారం చుట్టింది టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్.

ఆ త‌ర్వాత మిగ‌తా కంపెనీలు ఆర్థిక మాంద్యం పేరుతో తీసి వేయ‌డం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఇవాళ మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల చేదు క‌బురు చెప్పాడు. జీతాల పెంపుద‌ల‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని, ఈ ఏడాది ఉద్యోగుల‌కు ఇచ్చే బోన‌స్ బ‌డ్జెట్ పై కూడా కోత విధించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో సిఇఓ చేసిన ఈ ప్ర‌క‌ట‌నపై భ‌గ్గుమంటున్నారు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.

Leave A Reply

Your Email Id will not be published!