Satya Nadella : మైక్రోసాఫ్ట్ సిఇఓ సంచ‌ల‌న కామెంట్స్

ఎక్కువ ప‌ని ఒత్తిడి ఇబ్బందిక‌రం

Satya Nadella : మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ స‌త్య నాదెళ్ల సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. విస్త‌రిస్తున్న ప‌నిదినం వ‌ల్ల ఉద్యోగి శ్రేయ‌స్సు దెబ్బ తింటుంద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌స్తుతానికి బాగానే ఉన్న‌ప్ప‌టికీ త‌ర్వాత ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ను మెరుగు ప‌రిచే ప్ర‌య‌త్నంలో రిమోట్ వ‌ర్క్ స‌హ‌కారాన్ని ఎలా ప్ర‌భావితం చేస్తుందో అధ్య‌య‌నం చేశారు నాదెళ్ల‌(Satya Nadella).

వైట్ కాల‌ర్ వ‌ర్క‌ర్ల‌లో మూడో వంతు మంది కీబోర్డు పైనే గ‌డుపుతార‌ని తెలిపారు. రిమోట్ వ‌ర్క్ , ఉద్యోగం, ఇంటి జీవితాల మ‌ధ్య అస్ప‌ష్టంగా ఉన్న స‌రిహ‌ద్దుల‌ను ఎలా విచ్చిన్నం చేసిందో వివరిస్తుంద‌న్నాడు నాదెళ్ల‌.

వార్డ‌న్ ఫ్యూచ‌ర్ ఆఫ్ వ‌ర్క్ కాన్ఫ‌రెన్స్ లో స‌త్య నాదెళ్ల (Satya Nadella) మాట్లాడారు. నిర్వాహ‌కులు కార్మికుల‌కు స్ప‌ష్ట‌మైన రూల్స్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

దీని వ‌ల్ల అర్ధ‌రాత్రి పంపించే ఈమెయిల్స్ స‌మాధానం ఇవ్వాలంటూ ఒత్తిళ్లు చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. తాము స‌హ‌కారం, అవుట్ పుట్ కొల‌మానాల ద్వారా ఉత్పాద‌క‌త గురించి ఆలోచిస్తామ‌ని చెప్పారు.

అయితే ఉత్పాద‌క‌త కు సంబంధించి అత్యంత ముఖ్య‌మైన భాగాల‌లో శ్రేయ‌స్సు అనేది ఒక‌టి అని పేర్కొన్నారు. ఒత్తిడి వ‌ళ్ల కార్మికుల‌కు ఇబ్బంది ఏర్ప‌డుతుంది. సాఫ్ట్ స్కిల్స్ , పాత కాల‌పు నిర్వ‌హ‌ణ ప‌ద్దతుల‌ను నేర్చు కోవాల‌ని సూచించారు సిఇఓ.

పాండ‌మిక్ ( క‌రోనా కాలం) స‌మ‌యంలో మైక్రోసాఫ్ట్ స‌గ‌టు ప‌ని వారంలో 10 శాతం పెరుగుద‌ల‌ను చూసింద‌న్నారు. ఎక్కువ శాతం జాబ్స్ వ‌దిలి వేసేందుకు సిద్ద‌ప‌డం మంచిది కాద‌న్నారు.

Also Read : ఇన్వెస్ట‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం తెలంగాణ‌

Leave A Reply

Your Email Id will not be published!