Satya Pal Malik Modi : మణిపూర్ హింసపై మోదీ మౌనం
మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్
Satya Pal Malik Modi : జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గత 45 రోజులకు పైగా మణిపూర్ మండుతోందని, హింసోన్మాదంతో అట్టుడుకుతోందని అయినా దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. తనకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు మాజీ గవర్నర్.
రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని గనుక ఓడించక పోతే పరిస్థితి మరింత దిగజారి పోతుందని సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) హెచ్చరించారు. జాతుల మధ్య వైరం మణిపూర్ లో మంటలు రాజేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గతంలో మేఘాలయాకు గవర్నర్ గా కూడా పని చేశారు. ఈ సందర్భంగా సత్య పాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 100 మందికి పైగా చని పోయారని, ప్రాణ భయంతో ఏకంగా రాష్ట్రాన్ని వదిలి పెట్టి పోయిన వాళ్లు 60 వేల మంది దాకా ఉన్నారని , 300 మందికి పైగా గాయాలతో చికిత్స పొందుతున్నారని, 10 వేల మంది సైనికులు మోహరించినా ఎందుకని కంట్రోల్ చేయలేక పోతున్నారంటూ నిప్పులు చెరిగారు.
ఒక బాధ్యత కలిగిన పీఎం ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సత్య పాల్ మాలిక్. మహిళా రెజ్లర్ల పట్ల కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిందని, అందుకే జనాన్ని లూటీ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : CM DK Shiva Kumar : సీఎం కుర్చీపై భిన్నాభిప్రాయాలు
