Satya Pal Malik : మోదీ స‌పోర్ట్ మ‌రిచి పోలేను – గ‌వ‌ర్న‌ర్

స్ప‌ష్టం చేసిన స‌త్య పాల్ మాలిక్

Satya Pal Malik  : మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ న‌వాబ్ మాలిక్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధాని గురించి వ్యాఖ్యానించారు. జ‌మ్మూ కాశ్మీర్ లో అవినీతి ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ఏజెన్సీ ద‌ర్యాప్తును స్వాగ‌తించారు.

స‌త్య పాల్ మాలిక్ గ‌తంలో జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు త‌న‌కు సంత‌కం చేస్తే రూ. 300 కోట్లు లంచం ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాలిక్(Satya Pal Malik ).

ఇదిలా ఉండ‌గా స‌త్య పాల్ మాలిక్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ పై సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) గ‌త నెల మార్చి చివ‌ర‌లో విచార‌ణ ప్రారంభించింది.

త‌న‌కు నేరుగా లంచాలు ఇవ్వ లేద‌ని, అందులో పాల్గొన్న వారంద‌రి గురించి త‌న‌కు తెలుస‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు సీబీఐ ద‌ర్యాప్తును స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు.

లంచం ఇవ్వ చూపిన విష‌యం గురించి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి చెప్పాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఈ విష‌యంలో త‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికార‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధానితో చ‌ర్చించాక‌, గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik )తో సంప్ర‌దించిన అనంత‌రం సీబీఐ రంగంలోకి దిగింది. త‌న ప‌రిశీల‌న‌కు రెండు ఫైల్స్ వ‌చ్చాయి.

ఒక్కో ఫైలు కు రూ. 150 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశారు. వాటిని తాను తిర‌స్క‌రించాన‌ని స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్. ఈ విష‌యాన్ని గ‌త ఏడాది అక్టోబ‌ర్ 17న రాజ‌స్థాన్ లోని జుంజులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంలో కామెంట్ చేశారు.

Also Read : 10 నుంచి కోవిడ్ బూస్ట‌ర్ డోస్

Leave A Reply

Your Email Id will not be published!