Mohammed Bin Salman : అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కు కష్ట కాలం మొదలైనట్లుంది. ఆయన కొలువు తీరాక ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరిగి వచ్చాయి. ఆ తర్వాత పాకిస్తాన్ తో అంటీ ముట్టనట్లు ఉన్నారు.
మరో వైపు బర్మా – మయన్మార్ విషయంలో చైనా జోక్యం చేసుకుంటే యుద్దం చేస్తానని ప్రకటించాడు. కానీ డ్రాగన్ జూలు విదిల్చే సరికి మౌనం వహించారు. ఆపై తైవాన్ పై చైనా వార్ ప్రకటిస్తే బాగుండదని హెచ్చరించాడు.
కానీ అస్సలు పట్టించు కోలేదు చైనా చీఫ్ జిన్ పింగ్. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికా రాను రాను తన ప్రాభవాన్ని కోల్పోతోంది.
ప్రధానంగా అరబ్ కంట్రీస్ లో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ బైడెన్ కు కలిసి రావడం లేదు. ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ పై యుద్దాన్ని ప్రకటించింది.
ఇప్పటికే 9 రోజులుగా వార్ కొనసాగుతూనే ఉంది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్నాడు పుతిన్. తమ జోలికి వస్తే మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను పేల్చి వేస్తామంటూ ప్రకటించింది రష్యా. దెబ్బకు మనోడి పరువు గంగలో కలిసింది.
తాజాగా బైడెన్ కు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed Bin Salman)వార్నింగ్ ఇచ్చాడు. తమ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.
తన దేశం గురించి మేం ఆలోచించం. నా గురించి అపార్థం చేసుకున్నా పర్వా లేదు. కానీ సౌదీ అరేబియా జోలికి వస్తే సహించే ప్రసక్తి లేదన్నాడు. అమెరికాతో తమకు అవసరం లేదని తేల్చి పారేశాడు.
Also Read : భారత విద్యార్థిపై కాల్పులు – వీకే సింగ్