O Sajna Sawai Bhatt : గుండెల్ని మీటుతున్న ‘స‌వాయి’ ఓ స‌జ్నా

నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సాంగ్

O Sajna Sawai Bhatt : ఇండియ‌న్ ఐడిల్ లో త‌న గానంతో దేశ వ్యాప్తంగా కోట్లాది గుండెల్ని మీటిన స‌వాయి భ‌ట్ (O Sajna Sawai Bhatt)మ‌రోసారి మెస్మ‌రైజ్ చేశాడు. త‌న మాధుర్యాన్ని పంచుతూ కొత్త పాట‌కు సొబ‌గులు అద్దాడు.

రాజ‌స్థాన్ కు చెందిన ఈ అరుదైన జాన‌ప‌ద గాయ‌కుడి స్వ‌ర ప్ర‌వాహంలో యువ‌తీ యువ‌కులే కాదు ప్రేమికులు సైతం పాడుకుంటున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు హిమేష్ రేష్మియా స‌వాయి భ‌ట్ (O Sajna Sawai Bhatt) లోని టాలెంట్ ను గుర్తించాడు.

అత‌డి గొంతులోని దుఖఃంతో కూడిన వాయిస్ ను ప‌ట్టుకున్నాడు. ఇంకేం తానే రాసి పాట పాడించాడు స‌వాయి భ‌ట్ తో. ఇప్పుడది నెట్టింట్లో దూసుకు పోతోంది.

ఏనాడూ దేశం గ‌ర్వ‌ప‌డేలా తాను గాయ‌కుడిగా మారి పోతాన‌ని క‌ల‌లో కూడా అనుకోని భ‌ట్ మ‌రోసారి మెస్మైరైజ్ చేసేశాడు. ఆ పాట పేరు ఓ స‌జ్నా. ప్రైవేట్ సాంగ్ ఇది. హిమేష్ రేష్మియా ఆల్బ‌మ్ రూపొందించాడు.

దాని పేరు హిమేష్ కే దిల్ సే. ఈ ఆల్బ‌మ్ లోని పాట‌ల్ని స‌వాయి భ‌ట్ తో పాటు హిమేష్ రేష్మియా పాడారు. సాహిత్యం కూడా హిమేష్ అందించాడు. సంగీతం కూడా త‌నే. ఇంకేం వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఓ స‌జ్నా ఇప్పుడు ప్ర‌భంజ‌నం సృష్టించేందుకు రెడీగా ఉంది.

ఈ పాట‌ను ఫిమేల్ వ‌ర్ష‌న్ లో దివ్య కూడా పాడింది. అది కూడా హిట్టే. ఈ సంద‌ర్భంగా హిమేష్ రేష్మియా స‌వాయి భ‌ట్ గురించి ఓ మాట‌న్నాడు. ఇలాంటి గాయ‌కుడు త‌న‌కు దొరుకుతాడ‌ని అనుకోలేద‌న్నాడు.

రాజ‌స్తానీ హృద‌య‌మే కాదు ఆ మ‌ట్టిత‌న‌పు వాస‌న కూడా ఆ గొంతులో తొణికస లాడుతోంద‌ని స్ప‌ష్టం చేశాడు. అవును క‌దూ.

Also Read : ఓవ‌ర్సీస్ లో రాధే శ్యామ్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!