Scam Calls Alert : ఆ 10 ఫోన్ నెంబర్లు యమ డేంజర్
ఎత్తితే ఇక బ్యాంకు అకౌంట్లు ఖాళీ
Scam Calls Alert : టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయినా సైబర్ నేరస్థులు చెలరేగి పోతున్నారు. మోసాలు ఎక్కువగా ఫోన్ల ద్వారా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ ఐటీ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. ఏయే నెంబర్ల నుంచి ఎక్కువగా జనం మోస పోతున్నారో వెల్లడించింది. ఆయా నెంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆయా ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎత్త కూడదని స్పష్టం చేసింది.
మాటల్లో పెట్టి బ్యాంక్ అకౌంట్ ను చోరీ చేస్తారని పేర్కొంది.
Scam Calls Alert Updates
ఇదిలా ఉండగా ఆ 10 ఫోన్ నెంబర్లు ఇలా ఉన్నాయి. వీటి పట్ల సీరియస్ గా ఉండాలని సూచించింది సదరు సంస్థ.
1. (469)709-7630
మీకు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీ అందక పోతే పై నెంబర్‌కు కాల్ చేయమని మెసేజ్ వస్తుంది. కాల్ చేసిన తరువాత మీ పేమెంట్ పూర్తి కాలేదు. మళ్లీ డబ్బులు చెల్లించమని లింక్ పంపిస్తారు. ముందు చేసిన పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబడుతుందని నమ్మిస్తారు. మీరు డబ్బులు మళ్లీ చెల్లించారో ఇక అంతే సంగతులు.
2 .(865)630-4266
పై నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. వెల్స్ ఫార్గో సంస్థలో మీ అకౌంట్‌ని టెంపరరీగా బ్లాక్ చేస్తామని చెబుతారు. ఆ వెంటనే అన్‌లాక్ చేయడానికి ఒక నకిలీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్‌కు కాల్ చేస్తే అవతలి వ్యక్తి మీ అకౌంట్ వివరాలు అడిగి.. అందులో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ఖాళీ చేస్తారు.
3. (805)637-7243
ఈ నెంబర్ నుంచి కాల్ చేసి.. మేము పోలీసుల డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం. నకిలీ వీసా కేసులో మీపై కేసు నమోదైంది అని భయపెడతారు. ఆ తరువాత పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమంటారు.
4.(858)605-9622
ఈ నెంబర్(Number) నుంచి కాల్ చేసే వారు మీ బ్యాంక్ అకౌంట్ టెంపరరీగా నిలిపేయ బడిందని చెప్పి.. మిమ్మల్ని భయపెడతారు.
5. (863)532-7969
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. చాలా నిపుణులు. మీ డెబిట్ కార్డ్‌ని 24 గంటలపాటు బ్లాక్ చేసి.. అది సరిచేయాలంటే ఇంత డబ్బు చెల్లించమని అడుగుతారు.
6. (904)495-2599
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. మీరు ఏటి అండ్ టి అనే రైఫెల్ తుపాకీ గెలుచుకున్నారు .వెంటనే డెలివరీ చేస్తాం డబ్బులు చెల్లించమని అడుగుతారు.
7. (312)339-227
ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన వారు మీ అధిక బరువు తగ్గించేందుకు మా వద్ద మంచి ప్రాడక్ట్‌లు ఉన్నాయి.. అని చెబుతూ పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపారు. కానీ అందులో నకిలో మందులు ఉంటాయని తేలింది.
8.(917)540-7996
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. మీకు స్కీమ్ 6 లో విన్నర్‌గా నిలిచారని చెబుతూ.. వెంటనే మినిమమ్ చార్జీలు చెల్లించమని అడుగుతారు.
9.(347)437-1689
ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన వారు పెద్ద పెద్ద స్కామ్‌లు చేస్తారు. అమెరికన్ డాలర్లు మీ అకౌంట్‌లో వేయాలి, మీకు లాటరీ తగిలింది.. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, వచ్చిన ఓటిపీని అడుగుతారు.
10.(301)307-4601
ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మీకు అమెరికా(America) నుంచి పోస్టు రూపంలో ఖరీదైన బహుమతి వచ్చిందని. దాని డెలివరీ కోసం అయ్యే ఖర్చుని ముందుగా చెల్లించమని అడుగుతారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది సదరు కంపెనీ.
Also Read : Congress Third List : ఆ సీట్లపై తెగని పంచాయతీ
.