PM Modi Jinping SCO : చైనాతో భారత్ చర్చలపై సస్పెన్స్
మోదీ జిన్ పింగ్ ల భేటీ పై ఉత్కంఠ
PM Modi Jinping SCO : భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇరు దేశాల భేటీపై ఉత్కంఠ నెలకొంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (ఎస్ సిఓ) కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Jinping SCO) ఇవాళ ఉజ్బెకిస్తాన్ లో ఉన్నారు.
భారత్ తో సంబధాన్ని పంచుకుంటున్న మూడు దేశాల నాయకులతో కలిసి హాజరు కానున్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చను ప్రారంభించినప్పటికీ చైనా, పాకిస్తాన్ లతో నిర్మాణాత్మక సంభాషణకు వ్యతిరకంగా సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవాళ ఉజ్బెకిస్తాన్ కు చేరుకోనున్నారు ప్రధాన మంత్రి. కరోనా వ్యాప్తి చెందాక నేతలు ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. మరో వైపు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇప్పటికే సమర్ ఖండ్ చేరుకున్నారు.
ఆయనకు ఆ దేశ అధ్యక్షుడు షాప్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు. ఈ భేటీలో ప్రధాని మోదీతో జిన్ పింగ్ కలుస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే ఎజెండాలో మాత్రం ఇరు దేశాధినేతలు కలుసు కోనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శిఖారగ్ర సమావేశానికి కేవలం రెండు రోజుల కంటే ముందు లడఖ్ లోని గోగ్రా – హాట్ స్ప్రింగ్స్ పీపీ 15 వద్ద భారత దేశం, చైనా దళాలు విడి పోవడాన్ని ముగించాయి.
ఇక ఇద్దరు నాయకుల మధ్య సాధ్యమైన సమావేశం అంచనాలు పెంచింది. ఉక్రెయిన్ తో రష్యా యుద్దాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ కు ఇది కీలక భేటీ కానుండగా ఈ మొత్తం శిఖరాగ్ర సమావేశంపై అమెరికా ఫోకస్ పెట్టింది.
Also Read : చిరుతను మించి పోయిన మోదీ – ఓవైసీ