Manipur Election 2022 : దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మణిపూర్ , ఉత్తరాఖండ్ , గోవా, పంజాబ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా కొనసాగాయి.
యూపీలో ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఈనెల 7న ఏడో విడత పోలింగ్ తో ముగుస్తుంది.
ఇక తాజాగా మణిపూర్ రాష్ట్రంలో (Manipur Election 2022 )ఇప్పటికే మొదటి దశ పోలింగ్ పూర్తిగా కాగా రెండో దశ పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 6 జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఇందులో భాగంగా మొత్తం 92 మంది ఫ్యూచర్ బయట పడనుంది. ఇక ఆయా నియోజకవర్గాలలో ఉన్న ఓటర్లు మొత్తం 8 లక్షల 47 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.
ఈ ఓటర్లలో పురుషులు 4 లక్షల 18 వేల 401 ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 4 లక్షల 28 వేల 968 మంది ఉన్నారు. 31 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
కాగా ప్రత్యేకించి ట్రాన్స్ జెండర్ల కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1247 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరారు తమ ఓటు వేసేందుకు.
ఈ రెండో దశ పోలింగ్ లో మాజీ సీఎం ఇబోబి సింగ్ , ఆయన తనయుడు సూరజ్ , మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్ బరిలో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 18 మంది, జేడీయూ, నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి 10 మంది చొప్పున పోటీలో ఉన్నారు.
ఇక ఈ పార్టీలతో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ 11 మంది, శివసేన , ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున 12 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి.
Also Read : మోదీ రైతులకు సాయం ఏదీ