Lawrence Bishnoi : గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ కు భద్రత పెంపు
సిద్దూ కేసులో ఢిల్లీ పోలీస్ విచారణ
Lawrence Bishnoi : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసులో నేరస్తుల ముఠా నాయకుడు, జైలు శిక్ష అనుభిస్తున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు ఢిల్లీలోని తీహార్ జైలులో మరింత భద్రతను పెంచారు.
సిద్దూ కేసుకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీసులు అతడిని విచారించారు. మంగళవారం మాన్సాలో అశేష జనవాహిని అశ్రు నయనాల మధ్య సిద్దూకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి తనను ఎన్ కౌంటర్ లో పంజాబ్ పోలీసులు చంపేస్తారేమోనని అనుమానం, ఆందోళన వ్యక్తం చేశాడు లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi).
ఈ మేరకు తనను అక్కడికి పంపించొద్దంటూ కోర్టును కోరాడు. జైలు లోపల కూడా నిఘా పెంచారు. సింగర్ సిద్దూ మూసే వాలా హత్యకు బాధ్యత వహిస్తున్న కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కి అత్యంత సన్నిహితుడు.
ఇదిలా ఉండగా లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) ఢిల్లీ యూనివర్శిటీ మాజీ విద్యార్థి నాయకుడు. ఇదిలా ఉండగా అతడి ప్రమేయం ఎంత మాత్రం లేదని బిష్ణోయ్ తరపు న్యాయవాది ఖండించారు.
ఇంత భారీ కుట్రను జైలు నుండి ఎలా నడిపిస్తాడని ప్రశ్నించాడు. కాగా సిద్దూ మూసే వాలా హత్య వెనుక ముఠా కక్షలే కారణమని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే గోల్డీ బ్రార్ తీహార్ జైలులో ఒకరితో టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. హై సెక్యూరిటీ వార్డులో ఉన్న అతడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిన్న ప్రశ్నించింది.
Also Read : ఆరోగ్య మంత్రి అరెస్ట్ అక్రమం – సీఎం