Assam CM : సీఎం హిమంత శర్మకు భద్రత పెంపు
ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
Assam CM : ద్రతా కారణాల రీత్యా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆయన భద్రతను పెంచినట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అస్సాం సీఎంకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా పెంపుతో హిమంత శర్మకు(Assam CM) Z+ కేటగిరీ (ఆల్ ఇండియా)కి అప్ గ్రేడ్ చేసినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా డాక్టర్ హిమంత బిస్వా శర్మకు భద్రతా ఏర్పాట్లను కేంద్ర భద్రతా ఏజెన్సీతో సంప్రదించి సమీక్షించడం జరిగిందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకటనలో తెలిపంది.
దేశంలోనే అతి పెద్ద సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
ఇదిలా ఉండగా దేశంలోని ప్రధాన పదవుల్లో ఉన్న వారికి వారి వారి స్థాయిలను బట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ఆయా కేటగిరీలను కూడా ముందస్తుగా విభజించారు. దేశంలో అత్యున్నత భద్రతా వ్యవస్థ మాత్రం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ముందస్తుగా సెక్యూరిటీ ఆ ప్రాంతానికి చేరుకుంటుంది.
వారికంటూ స్వంత టీం ఉంటుంది. ఇది ఎవరి ఆధీనంలో ఉండదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధి మేరకు పని చేస్తుంది. ఇదిలా ఉండగా సెక్యూరిటీకి సంబంధించి ఎక్స్ , వై, వై ప్లస్ , జెడ్ , జెడ్ ప్లస్ ఉంటుంది. కాగా ఒక్క ప్రధానికి మాత్రం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీ కల్పిస్తారు.
Also Read : టెలికాం రంగంలో 5జీ పెను సంచలనం