Eknath Shinde : మ‌రాఠా స‌ర్కార్ లో షిండే ‘క్యాంపు’ క‌ల‌క‌లం

వేరు కుంప‌ట‌తో అత్య‌వ‌స‌ర మీటింగ్

Eknath Shinde : మ‌రాఠాలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఊహించ‌ని రీతిలో పుంజుకుంది. ఎలాగైనా స‌రే శివ‌సేన సంకీర్ణ స‌ర్కార్ మ‌హా వికాస్ అఘాడి (ఎంవిఎ) ని కూల్చేస్తామంటూ కేంద్ర మంత్రి ఆ మ‌ధ్య‌న కామెంట్ చేశారు.

తాజాగా శివ‌సేన కూట‌మిలో ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న షిండే వేరు కుంప‌టి పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. గుజ‌రాత్ సూర‌త్ లోని ఓ హోట‌ల్ లో కొంద‌రు ఎమ్మెల్యేల‌తో క్యాంప్ ఏర్పాటు చేసిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

షిండేతో పాటు 11 మంది ఉన్న‌ట్లు టాక్. మహారాష్ట్ర‌లోని థానేకు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడుగా ఉన్నారు ఏక్ నాథ్ ముండే(Eknath Shinde). శివ‌సేన పార్టీ బ‌లోపేతంలో కీల‌క పాత్ర పోషించారు.

గ‌త కొంత కాలం నుంచి ముండే నిర్వ‌హిస్తున్న శాఖ‌లో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు ఆయ‌న త‌న‌యుడు ఆదిత్యా ఠాక్రేలు జోక్యం ఎక్కువైంద‌ని మండిప‌డుతున్నారు. స‌మ‌యం కోసం వేచి చూస్తున్నారు.

ఇప్ప‌టికే బీజేపీ కాచుకుని కూర్చుంది. ఇంకో వైపు డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ నుంచి నిధుల మంజూరులో వివ‌క్ష చూపిస్తున్నారంటూ ఏక్ నాథ్(Eknath Shinde)  ముండే ఆగ్ర‌హంతో ఉన్నారు.

షిండేతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు జంప్ అయ్యార‌న్న స‌మాచారం తెలుసుకున్న సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే అత్యవ‌స‌ర స‌మావేశానికి పిలుపునిచ్చారు. వెంట‌నే త‌న‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ కావాల‌ని ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా పైకి క్రాస్ ఓటింగ్ అని చెబుతున్నా ప్ర‌ధానంగా ఏక నాథ్ ముండే క్యాంపు పై చర్చించు కునేందుకేన‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!