Ponguleti Jupalli Joins : కాంగ్రెస్ వైపు నేత‌ల‌ చూపు..?

పొంగులేటి, జూప‌ల్లి, కూచుకుళ్ల‌..పిడ‌మ‌ర్తి

Ponguleti Jupalli Joins : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక భార‌త రాష్ట్ర స‌మితిలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు సైతం ప్ర‌స్తుతం హ‌స్తం గూటికి చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

బీఆర్ఎస్ నుంచి వేటుకు గురైన వారిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో పాటు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కాంగ్రెస్(Congress) వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. శ్రీ‌నివాస్ రెడ్డికి ఖ‌మ్మం జిల్లాలో మంచి ప‌ట్టుంది. ఇక జూప‌ల్లికి స్వంత అనుచ‌ర వ‌ర్గం ఉంది. ఆయ‌న కేసీఆర్ తీరును, పార్టీ అనుస‌రిస్తున్న విధానాలు న‌చ్చ‌క తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు ప్ర‌క‌టించారు.

మాజీ ఎంపీ, మాజీ మంత్రి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. వారిని త‌మ పార్టీలో చేరాల్సిందిగా మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ కోరారు. కానీ వారు ఒప్పు కోలేదు. చివ‌ర‌కు జూప‌ల్లి తాజాగా మాజీ మంత్రి, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు.

మ‌రో వైపు భారత రాష్ట్ర స‌మితి పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా నుంచి సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మాజీ జిల్లా ప‌రిషత్ చైర్మ‌న్ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి సైతం హ‌స్తం గూటికి రానున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న మ‌ల్లుర‌విని క‌లుసుకున్నారు.

ఇదే స‌మ‌యంలో చైర్మ‌న్ గా ప‌ని చేసిన బీఆర్ఎస్ కు చెందిన పిడ‌మ‌ర్తి సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో వీరంతా చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Actor Vijay : ‘త‌ళ‌ప‌తి’ ఆస‌రా విద్యార్థులు ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!