Sergey Lavrov : భారత దేశం (India) ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటే చర్చించేందుకు సిద్దంగా ఉందన్నారు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్ రోవ్(Sergey Lavrov ). ఇవాళ ఆయన భారత్ (India) లో పర్యటించారు. ఈ సందర్బంగా లావ్ రోవ్ (Lavrov) మాట్లాడాడు.
భారత్ తమ నుంచి ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే పరస్పరం ఆమోద యోగ్యమైన సహకారంతో చర్చించు కునేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రష్యా (Russia) నుంచి భారత్ ఏది కొనుగోలు చేయాలనుకున్నా సరఫరా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి. ఇండియాలో పర్యటించడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు.
భారత దేశం అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పదే పదే ప్రశంసించారు. రష్యా (Russia) నుండి ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే తాము ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో లావ్ రోవ్ భేటీ అయ్యారు. అనంతరం లావ్ రోవ్ (Lavrov) మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ఏది కొనుగోలు చేయాలనుకున్నా సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరప లేరని స్పష్టం చేశారు లావ్ రోవ్(Sergey Lavrov ). ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి , ఆంక్షల మధ్య రష్యా విదేశాంగ మంత్రి గురువారం వచ్చారు.
రాయితీపై రష్యా చమురును భారత దేశం ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయగలదనే సూచనల మధ్య ఇద్దరు విదేశాంగ మంత్రుల ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మరో వైపు అమెరికా (America) భారత్ పై ఫైర్ అవుతోంది..
Also Read : పార్టీ బలోపేతానికి కృషి చేయాలి