Union Cabinet: కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు !
కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు !
Union Cabinet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కొలువైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం… 8వేల అతిథులతో కిక్కిరిసిపోయింది. మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరిలో నరేంద్ర మోదీతో సహా ఏడుగురికి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండటం గమనార్హం.
Union Cabinet..
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), రాజ్‌నాథ్ సింగ్ (ఉత్తర్ ప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక), జితిన్ రామ్ మాంఝీ (బిహార్) సీఎంలుగా సేవలందించారు. వీరిలో ఐదుగురు బీజేపీకు చెందిన నేతలు కాగా… జేడీఎస్ కుమార స్వామి, హిందుస్థానీ అవామ్ మోర్చా నేత మాంఝీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు.
Also Read : Narendra Modi: 72 మందితో కొలువుతీరిన మోదీ 3.0 కేబినెట్ !