US Walmart Store Killed : యుఎస్ వాల్ మార్ట్ లో కాల్పుల మోత
సాయుధుడైన వ్యక్తి కాల్పులు
US Walmart Store Killed : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఉన్నట్టుడి మరో ఘటన చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం గన్ లైసెన్స్ , తయారీపై వేటు వేస్తామని ప్రెసిడెంట్ బైడెన్ హెచ్చరించినా దానిని ట్రంప్ వర్గీయులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉండగా సాయుధుడైన వ్యక్తి (గన్ మెన్ ) విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, పలువురు మృతి చెందారని సమాచారం. అయితే కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటన యుఎస్ లోని సామ్ సర్కిర్ లో ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో(US Walmart Store Killed) చోటు చేసుకుంది.
గన్ మెన్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, ఇది వాస్తవమేనని చీసాపీక్ పోలీసులు ధ్రువీకరించారు. కాల్పులకు పాల్పడిన షూటర్ పోలీసు కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు. కాగా అమెరికా లోని వర్జీనియా రాష్ట్రంలో అర్ధరాత్రి వాల్ మార్ట్ స్టోర్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చీసా పీక్ పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారి లియో కోసిన్స్కీ స్పష్టం చేశారు.
బుధవారం మీడియాతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయితే ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపట్టామన్నారు. పోలీసులు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ప్రస్తుతానికి కాల్పులకు పాల్పడింది గన్ మెన్ ఒక్కరేనని ఇంకా తదుపరి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
ఇంకా ఎంత మంది చని పోయి ఉంటారనేది పూర్తిగా తెలియదు.
Also Read : ఉక్రెయిన్ కు భరోసా జెలెన్ స్కీకి ఆసరా