Smriti Mandhana IPL : రూ. 3.4 కోట్లతో స్మృతీ మంధాన రికార్డ్
ఉమెన్ ఐపీఎల్ వేలం పాట
Smriti Mandhana IPL : మార్చిలో నిర్వహించే ఉమెన్ ఐపీఎల్ లో ఆడే ప్లేయర్లకు సంబంధించి వేలం పాట కొనసాగుతోంది. ఇప్పటి వరకు టాప్ లో కొనసాగుతోంది స్మృతీ మంధాన(Smriti Mandhana IPL). ఏకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఏకంగా రూ. 3.4 కోట్లకు చేజిక్కించుకుంది. ఇది భారతీయ మహిళా క్రికెట్ లో ఓ రికార్డు. అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది.
మరో ప్లేయర్ ఆష్లీ గార్డనర్ గుజరాత్ జెయింట్స్ ఏకంగా రూ. 3.2 కోట్లకు తీసుకుంది. దీప్తి శర్మ అప్ వారియర్స్ నుండి రూ. 2. 60 కోట్లకు వేలం పాటలో దక్కించుకుంది. ఉమెన్ ఐపీఎల్ వేలంలో మొత్తం 1525 ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితాలో కేవలం 449 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకుంది బీసీసీఐ.
ఐదు ఫ్రాంచైజీలు మాత్రమే ఉన్నాయి. గరిష్టంగా 90 స్లాట్ లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లకు స్లాట్ చేశారు. హర్మన్ ప్రీత్ కౌర్ రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. సోఫీ డివైన్ రూ. 50 లక్షలు , ఆష్లీని గుజరాత్ జెయింట్స్ తీసుకుంది. సోఫీఎక్లెస్టోన్ ను రూ. 1.8 కోట్లు యుపీ వారియర్స్ తీసుకుంది. ఎల్లీస్ పెర్రీ ని రూ. 1.7 కోట్లకు ఆర్సీబీ, దీప్తి శర్మ ఊ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ , రేణుకా సింగ్ ను ఆర్సీబీ రూ. 1.50 కోట్లకు తీసుకుంది.
నాట్ స్కివర్ ను రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ , తహ్లియా ను రూ. 1.4 కోట్లకు యూపీ వారియర్స్ , బెత్ మూనీ గుజరాత్ రూ. 2 కోట్లకు , షబ్నమ్ ఇస్మాయిల్ ను రూ. కోటి కి యూపీ వారియర్స్ , అమేలియా కేర్ ను రూ. కోటికి ముంబై తీసుకుంది. సోఫియా డంక్లీని రూ. 60 లక్షలకు గుజరాత్ , జెమీమా రూ. 2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది.
సెఫాలీ వర్మను రూ. 2 కోట్లకు , మెగ్ లానింగ్ రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ , అన్నాబెల్ రూ. 70 లక్షలకు గుజరాత్ , హర్లీన్ డియోల్ రూ. 40 లక్షలు , పుజా వస్త్రాకర్ రూ. 1.90 కోట్లు ముంబై ఇండియన్స్ తీసుకుంది. డియాండ్రా డోటిన్ రూ. 60 లక్షలకు గుజరాత్ , యస్తికా భాటియా రూ. 1.50 కోట్లు, అంజలి సర్వాణి రూ. 55 లక్షలు యూపీ వారియర్స్ , రాజేశ్వరి గైక్వాడ్ రూ. 40 లక్షలకు యూపీ వారియర్స్ తీసుకుంది.
Also Read : మూడో టెస్టు వేదిక మార్పు – బీసీసీఐ