Kodali Nani : షా ప‌క్కా పొలిటిక‌ల్ స్కెచ్ – కొడాలి

మాజీ మంత్రి సంచ‌ల‌న కామెంట్స్

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ అలియాస్ తార‌క్ భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి క‌ల‌యిక ఇరు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నంగా మారింది. తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. మునుగోడులో జ‌రిగిన బీజేపీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు అమిత్ షా.

అనంత‌రం శంషాబాద్ లోని నోవా టెల్ హోట‌ల్ లో రాత్రి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రూ 15 నిమిషాల‌కు పైగా స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

దీనిపై కొడాలి నాని సోమ‌వారం స్పందించారు. దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్త‌రించే ప‌నిలో కేంద్ర మంత్రి అమిత్ షా, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఫుల్ బిజీగా ఉన్నార‌ని అన్నారు.

వాళ్లు త‌మ‌కు అవ‌స‌ర‌మైతే త‌ప్పా ఎవ‌రినీ క‌ల‌వ‌ర‌ని, ఎవ‌రినీ ఆద‌రించ‌ర‌ని ఆ విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌న్నారు. కొడాలి నాని(Kodali Nani)  మీడియాతో మాట్లాడారు.

ఎలాంటి రాజ‌కీయ కార‌ణాలు లేకుండా షా, మోదీ ప‌క్క‌కు ఎవ‌రినీ కూర్చోనీయ‌ర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. టీడీపీ అయినా లేదా తార‌క్ అయినా ఎవ‌రు క‌లిసినా త‌మ‌కు , పార్టీకి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమీ లేద‌న్నారు కొడాలి నాని.

అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్త‌రించడంలో భాగంగానే అమిత్ షాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లివార‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం మాజీ మంత్రి నాని చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ప్ర‌ధాని మోదీతో ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!