Shaheen Bagh : ఢిల్లీలో కూల్చివేతలపై జనాగ్రహం
భారీగా మోహరించిన పోలీసు బలగాలు
Shaheen Bagh : దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎస్సీలో కూల్చివేతను సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు దావా వేశారు. నిరసనలు, ఆందోళనలను అరికట్టేందుకు భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ ) ఆక్రమణల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది.
భారీ ఎత్తున బుల్ డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ కూల్చివేతలను నిరిసిస్తూ పెద్ద ఎత్తున బాధితులు రోడ్లపైకి వచ్చారు.
2019లో పౌర సత్వ చట్ట వ్యతిరేక నిరసనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయి షాహీన్ బాగ్(Shaheen Bagh) , జహంగీర్ పురి. ఇప్పటికే జహంగీర్ పురి పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ప్రస్తుతం షాహీన్ బాగ్(Shaheen Bagh) రెండోది కావడం గమనార్హం. వాయువ్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన ప్రదర్శనలను శ్రీరామ నవమి సందర్బంగా జరిగిన హింసాకాండతో ముడి పెట్టారు.
పేద ప్రజలు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆక్రమణలను కూల్చి వేస్తున్నారంటూ బాధితులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధితుల పక్షాన ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ పోరాడారు.
తన అభ్యర్థన మేరకు ఆక్రమణలు తొలగించారు. కానీ మళ్లీ ఆక్రమణల పేరుతో రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు. కొన్ని షాపుల యజమానులు వారే బుల్ డోజర్లకు స్వాగతం పలికారు.
ఆక్రమణలు తొలగించేందుకు బుల్ డోజర్లు, ట్రక్కులు, పోలీసు బలగాలతో చేరుకున్నామని ఎస్డీఎంసీ సెంట్రల్ జోన్ చైర్మన్ రాజ్ పాల్ సింగ్ వెల్లడించారు.
ఇప్పటికే సమాచారం కూడా అందజేశామన్నారు. పేదలపై ఇది బీజేపీ చేస్తున్న దాడిగా అభివర్ణించింది ఆమ్ ఆద్మీ పార్టీ.
Also Read : మాతృభూమి కోసం సైనికుల పోరాటం