Jairam Ramesh : రాహుల్ యాత్రతో బీజేపీలో వణుకు – జై రాం
కాంగ్రెస్ మీడియా ఇన్ చార్జి రమేష్
Jairam Ramesh : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ స్పందన వస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జి జై రాం రమేష్. ఇదే సమయంలో యాత్రను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. మంగళవారం జై రాం రమేష్(Jairam Ramesh) మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఉనికి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో ముగిసిందన్నారు. ప్రస్తుతం రాహుల్ చేపట్టిన యాత్ర తెలంగాణలోని మక్తల్ కు చేరుకుంది. ఏఐసీసీ చీఫ్ గా కొత్తగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం బుధవారం జరగనుంది.
ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఆ తర్వాత తిరిగి 27 నుండి మళ్లీ తెలంగాణలోని గూడె బల్లూరు నుండి పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పారు. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుందని చెప్పారు జైరాం రమేష్.
న్యూఢిల్లీలోని ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత 48 రోజుల భారత్ జోడో యాత్రలో దాదాపు 50 సంస్థలు రాహుల్ గాంధీని కలిశాయని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు వెల్లడించారు జై రాం రమేష్(Jairam Ramesh). ఇప్పటి వరకు రాహుల్ గాంధీ నాలుగు చోట్ల మాట్లాడారు.
పాదయాత్ర సందర్భంగా ప్రతి రాష్ట్రంలోనూ మీడియాతో సంభాషిస్తారని స్పష్టం చేశారు. అక్టోబర్ 31న హైదరాబాద్ సమీపంలో నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read : కంచుగల్ మఠంలో ‘స్వామి’ సూసైడ్