Padma Shree Awardee : 90 ఏళ్ల వయసు కలిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీతతో పాటు మరికొంత మంది కళాకారులకు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ ఇళ్లను ఖాళీ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది.
నోటీసులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు పొందిన గురుమాయాధర్ రౌత్(Padma Shree Awardee) కూడా ఉన్నారు. 90 ఏళ్ల కిందట ప్రభుత్వ వసతి గృహాలను కేటాయించింది. 2014లో వాటిని రద్దు చేసింది.
ఇందులో ఎనిమిది మంది కళాకారులను వచ్చే మే2 లోగా ఖాళీ చేయాలని కోరింది. ఇందులో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒడిస్సీ నృత్యకారుడు గురు మాయాధర్ రౌత్ ఉన్నారు.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఈ సందర్భంగా స్పందించారు. 28 మంది కళాకారులకు ఈ సందర్బంగా ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చామన్నారు.
కానీ ఈ ఎనిమిది మంది కళాకారులు తమ నోటీసులకు స్పందించ లేదని తెలిపారు. అనేక సార్లు నోటీసులు అందజేసినా తమ ప్రభుత్వ వసతి గృహాల నుంచి బయటకు వెళ్లలేదు.
అయితే ఈ కళాకారులు తమ బంగ్లాలను ఖాళీ చేసే పనిలో ఉన్నామని హామీ ఇచ్చారు. ఇంకొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. మే 2 లోపు ఖాళీ చేస్తామంటూ రాత పూర్వకంగా రాసి ఇచ్చారని వెల్లడించారు.
అయితే పద్మశ్రీ గురు మాయాధర్ రౌత్ (Padma Shree Awardee)తొలగింపుపై అధికారుల బృందాన్ని పంపించడం , ఆయన సామాన్లు బయట ఉంచిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా కళాకారులు నెలకు రూ.20 వేల లోపు సంపాదిస్తే సాంస్కతిక మంత్రిత్వ శాఖ సిఫారసుపై జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ లో ప్రత్యేక కోటా కింద వసతిని కేటాయించవచ్చు.
Also Read : అజయ్ దేవగన్ పై ‘కుమార’ కన్నెర్ర