Shankar Mishra Row : ప‌రిహారంగా రూ. 15 వేలు చెల్లింపు

మూత్రం ఘ‌ట‌న‌లో శంక‌ర్ మిశ్రా వెల్ల‌డి

Shankar Mishra Row : దేశ వ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానంలో ప్ర‌యాణికుడు శంక‌ర్ మిశ్రా మూత్ర విస‌ర్జ‌న క‌ల‌క‌లం రేపింది. చివ‌ర‌కు త‌న ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసింది. తాజాగా సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టారు శంక‌ర్ మిశ్రా త‌ర‌పు లాయర్ . అదేమిటంటే మూత్రం పోసినందుకు గాను వృద్ద మ‌హిళ‌కు రూ. 15 వేలు ప‌రిహారంగా చెల్లించిన‌ట్లు చెప్పారు.

ఇక విష‌యానికి వ‌స్తే శంక‌ర్ మిశ్రా గ‌త ఏడాది 2022 న‌వంబ‌ర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్ – ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్ర‌యాణం చేశాడు. ఇదే స‌మ‌యంలో శంక‌ర్ మిశ్రా(Shankar Mishra Row) త‌న ప‌క్క‌నే ఉన్న 70 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన వృద్దురాలిపై మూత్ర విస‌ర్జ‌న చేశారు. దీంతో స‌ద‌రు మ‌హిళ తీవ్ర అభ్యంత‌రం తెలిపింది.

ఇలాంటి ప్ర‌యాణికుల‌ను ఎలా అనుమ‌తి ఇస్తారంటూ నిల‌దీసింది. ఈ మేరకు స‌ద‌రు ప్ర‌యాణికురాలు ఏకంగా ఎయిర్ ఇండియా స‌ర్వీసు ప‌ట్ల తాను ప‌డిన ఇబ్బంది గురించి తెలియ చేసింది. అంతే కాకుండా ఎయిర్ ఇండియా చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ వ్య‌వ‌హారం ఆల‌స్యంగా వెలుగు చూడ‌డంతో కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అయ్యారు. ఇందులో భాగంగా ఎయిర్ లైన్స్ ల‌ను నియంత్రించే డీజీసీఏ ఎయిర్ ఇండియాకు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా కేసు న‌మోదు కావ‌డంతో శంక‌ర్ మిశ్రా ను అమెరికా ఆర్థిక సంస్థ ఉద్యోగం నుంచి తొల‌గించింది. అత‌డి వ‌ల్ల త‌మ కంపెనీకి చెడ్డ పేరు వ‌చ్చింద‌ని వాపోయింది.

Also Read : ఎయిర్ లైన్స్ ల‌కు డీజీసీఏ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!