Sharad Pawar : రైల్వే శాఖా మంత్రిపై పవార్ గుస్సా
వెంటనే పదవికి రాజీనామా చేయాలి
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ఘటనపై ఆవేదన చెందారు. శరద్ పవార్(Sharad Pawar) ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పై నిప్పులు చెరిగారు. ఈ ఘటనకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది కేంద్రం, ఆయనేనంటూ మండిపడ్డారు. ఇది పూర్తిగా మానవ తప్పిదని, ఒక రకంగా బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. విచారణ తర్వాత ముందు తన పదవి నుంచి రైల్వే శాఖ మంత్రి తప్పు కోవాలని డిమాండ్ చేశారు శరద్ పవార్.
ఈ సందర్భంగా దేశ చరిత్రలో తన పదవి నుంచి తప్పుకున్న గొప్ప నాయకుడు దివంగత ప్రధాని, రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గురించి గుర్తు చేశారు. భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తే చీమ కుట్టినట్టు కూడా లేదంటూ ఫైర్ అయ్యార్ శరద్ పవార్. ఇదిలా ఉండగా ఆనాడు శాస్త్రి తన పదవి నుంచి తప్పుకున్నారు. కానీ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వద్దన్నారని తెలిపారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రీ ఒప్పు కోలేదన్నారు.
ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. పీఎం సహాయ నిధి నుంచి చని పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. ఇదే సమయంలో రైల్వే శాఖ కూడా పరిహారం ఇస్తున్నట్లు తెలిపింది.
Also Read : Dasoju Sravan