Sharad Pawar : రాజ్యసభ రిజల్ట్స్ పట్టించుకోం
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
Sharad Pawar : దేశ వ్యాప్తంగా కీలకంగా మారిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా మహారాష్ట్రలో బీజేపీ పుంజుకుంది. అధికారంలో ఉన్న శివసేన పార్టీకి షాక్ ఇచ్చింది.
అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి గా ఏర్పాటై ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలలో 57 సీట్లకు ఎన్నికలు జరిగితే 41 సీట్లు ఏకగ్రవం అయ్యాయి.
ఇక మిగిలన 16 సీట్లకు గాను హర్యానా, రాజస్థాన్ , కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్ లో కాంగ్రెస్ 3 సీట్లు గెలిస్తే ఒక సీటు బీజేపీ విజయం సాధించింది. ఇక కర్ణాటకలో జేడీఎస్ కి కోలుకోలేని షాక్ తగిలింది.
ఇక్కడ 3 సీట్లు కాంగ్రెస్ పరమైతే ఒక సీటు బీజేపీ చేజిక్కించుకుంది. ఇక మరాఠాలో 6 ఎంపీ సీట్లకు గాను 3 సీట్లను మహా వికాస్ అఘాడీ కూటమి గెలుపొందితే మరో మూడు సీట్లలో బీజేపీ గెలుపొందింది.
ఇక శివసేన పార్టీ అభ్యర్థి సంజయ్ పవార్ అనూహ్యంగా ఓడి పోయాడు. దీనిపై బీజేపీ సంతోషంలో మునిగి పోగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) మాత్రం కూల్ గా సమాధానం ఇచ్చారు.
ఈ ఫలితాలపై తాము షాక్ కు గురి కాలేదన్నారు. రాజకీయాలలో ఎన్నికలు అన్నాక ఒక్కోసారి గెలుపు, ఓటములు పలకరిస్తూనే ఉంటాయన్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు. శివసేనకు చెందిన సంజయ్ రౌత్ , ఎన్సీపీకి చెందిన ప్రపుల్ పటేల్ విజయం సాధించారు.
ఆరో సీటు పోయింది . ఈ గెలుపు వల్ల ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు పవార్(Sharad Pawar).
Also Read : రాష్ట్రపతి ఎన్నికపై ఎడతెగని ఉత్కంఠ