Sharad Pawar : అజిత్ ప‌వార్ జంప్ శ‌ర‌ద్ ప‌వార్ ఫైర్

ఎమ్మెల్యేలు వెళ్లినా ప్ర‌జ‌లు మా వైపే

Sharad Pawar : ఎన్సీపీలో ఇప్ప‌టి దాకా ఉన్న అజిత్ ప‌వార్ ఉన్న‌ట్టుండి ఆదివారం బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ కు. పార్టీకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌స్తుతం 30 మంది ఎమ్మెల్యేల‌తో ఉన్న‌ట్టుండి పార్టీకి గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అజిత్ ప‌వార్. ఆ వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా స‌హ‌చ‌రుల‌తో క‌లిసి నేరుగా రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. అక్క‌డికి సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ చేరుకున్నారు. వారిద్ద‌రి స‌మ‌క్షంలో అజిత్ ప‌వార్ మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేశారు. ఆయ‌న వ‌ర్గంలో మ‌రికొంద‌రికి కేబినెట్ లో చోటు ద‌క్క‌నుంద‌ని టాక్.

ఇదిలా ఉండ‌గా పార్టీలో ఉంటూ న‌మ్మ‌క ద్రోహానికి పాల్ప‌డిన అజిత్ ప‌వార్ పై సీరియ‌స్ అయ్యారు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar). ఎమ్మెల్యేలు త‌మ పార్టీపై గెలిచి బీజేపీ ఇచ్చే ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డి ద్రోహానికి పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు వెళ్లినా ప్ర‌జ‌లు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. కావాల‌ని బీజేపీ ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏదో ఒక రోజు షిండే, ఫ‌డ్న‌వీస్ స‌ర్కార్ కు ప్ర‌జ‌లు బుద్దిచెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు శ‌ర‌ద్ ప‌వార్. మొత్తంగా ఎన్సీపీలో చీల‌క ఇప్పుడు విప‌క్షాల ఐక్య‌త‌పై ప్ర‌భావం చూపే ఛాన్స్ ఉంది.

Also Read : Ajit Pawar : డిప్యూటీ సీఎంగా అజిత్ ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!