Sharath Babu Actor : న‌ట‌నంటే ప్రాణం స్వేచ్ఛంటే ఇష్టం

శ‌ర‌త్ బాబు జీవిత ప్ర‌స్థానం

Sharath Babu Actor : ప్ర‌శాంత‌మైన మోము, చెర‌గ‌ని చిరున‌వ్వు. ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోయే రూపం న‌టుడు(Actor) శ‌ర‌త్ బాబుది(Sharath Babu). గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది ప‌డ్డారు. చివ‌ర‌కు సోమవారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో క‌న్ను మూశారు. విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందారు. నాయ‌కుడిగా, ప్ర‌తి నాయ‌కుడిగా ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేశాడు. జీవించినంత వ‌ర‌కు , ప్రాణం పోయేంత వ‌ర‌కు శ‌ర‌త్ బాబు(Sharath Babu) న‌టుడిగానే(Actor) ఉండి పోవాల‌ని క‌ల‌లు క‌న్నారు. అలాగే త‌నువు చాలించారు. న‌ట‌నంటే ప్రాణ‌మ‌ని స్వేచ్ఛ‌గా ఉండ‌ట‌మంటే చాలా ఇష్ట‌మ‌ని ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. పాత్ర చిన్న‌దా పెద్ద‌దా అన్న‌ది ప‌ట్టించు కోలేదు. నటించేందుకు స్కోప్ ఉన్న ప్ర‌తి పాత్ర‌లోనూ జీవించారు శ‌ర‌త్ బాబు.

ఎవ‌రైనా 50 ఏళ్లు వ‌స్తే ఊసురుమ‌ని ఉండి పోతారు. కానీ శ‌ర‌త్ బాబు 70 ఏళ్లు దాటినా న‌టిస్తూనే వ‌చ్చారు. ఇది న‌ట‌న ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న ప్రేమను తెలియ చేస్తుంది. ఇచ్చిన ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేశాడు. న‌టుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు, పుర‌స్కారాలు అందుకున్నా వివాహం వ‌చ్చే స‌రికి ఒక‌రితో ఉండ‌లేక పోయారు.

సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు క‌లిసి ఉన్నారు. ఆ త‌ర్వాత విడి పోయారు. నంబియార్ కూతురు స్నేహ‌ను వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల పాటు క‌లిసి ఉన్నా ఎందుక‌నో క‌టీఫ్ చెప్పారు శ‌ర‌త్ బాబు. మంచి మ‌నిషిగా, అజాత శ‌త్రువుగా పేరు పొందారు. ఎవ‌రితో మాట్లాడినా స్నేహ పూర్వ‌కంగానే వ్య‌వ‌హ‌రించే వారు. వెండి తెర మీద త‌న ముద్ర వేసిన శ‌ర‌త్ బాబు ఆ త‌ర్వాత బుల్లి తెర‌పై కూడా చెర‌గ‌ని సంత‌కం చేశారు. త‌మిళం, తెలుగు కు చెందిన ప‌లు సీరియ‌ళ్ల‌లో ఆయ‌న ప్ర‌ముఖ పాత్ర పోషించారు. సాంఘిక‌, పౌరాణిక‌, జాన‌ప‌ద‌, భ‌క్తి చిత్రాల‌లో న‌టించారు..శ‌ర‌త్ బాబు మెప్పించారు. ఆయ‌న న‌ట‌నంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ చెప్ప‌డం విశేషం.

న‌టుడిగానే కాదు ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లోనూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు శ‌ర‌త్ బాబు. మ‌రో చ‌రిత్ర‌, ఇది క‌థ కాదు, మూడు ముళ్ల బంధం, స్వాతి ముత్యం, సీతాకోక చిలుక‌, జీవ‌న జ్యోతి, అభినంద‌న‌, ఆప‌ద్భాంధ‌వుడు, శ్రీ‌రామ‌దాసు, ఆట‌, సాగ‌ర సంగ‌మం, వ‌కీల్ సాబ్ చిత్రాల‌లో గుర్తింపు పొందారు.

Also Read : Wrestlers Protest

Leave A Reply

Your Email Id will not be published!