Oh My Aadhya Song : ర‌ష్మిక‌తో శ‌ర్వానంద్ ల‌వ్లీ సాంగ్

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు నుంచి రిలీజ్

Oh My Aadhya Song : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు కిషోర్ తిరుమ‌ల‌. ఒక డిఫ‌రెంట్ మూవీకి ప్లాన్ చేశాడు. జీవితంలో ఆడ‌వాళ్ల ప్రాధాన్య‌త‌ను తెలిపేలా సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీలో శ‌ర్వానంద్, నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరొందిన ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించి టేకింగ్ అద్భుతంగా ఉంది.

చిత్రానికి సంబంధించిన టీజ‌ర్, సాంగ్స్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాలోని రెండో పాట ను విడుద‌ల చేసింది మూవీ మేక‌ర్స్.

ఓ మై ఆద్యా (Oh My Aadhya Song)అంటూ పాడుకునే పాట‌ను అద్భుతంగా చత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. ర‌ష్మిక‌, శ‌ర్వానంద్ ల మ‌ధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ గేయాన్ని శ్రీ‌మ‌ణి రాశాడు.

పాట‌లో క్యాచీగా ఉన్నాయి ప‌దాలు. ర‌ష్మిక కోసం హీరో వెయిట్ చేస్తున్న‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇద్ద‌రి న‌ట‌న సూప‌ర్ గా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. రాజు సుంద‌రం ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ చేశాడు.

సాంగ్ ను చూశాక కొత్త ఫీలింగ్ క‌లిగించేలా ఉంది. ర‌ష్మిక మంద‌న్నా అందాలు ఈ పాట‌కు హైలెట్ గా మారాయ‌ని చెప్ప‌డంలో త‌ప్పు లేదు. ప్ర‌స్తుతం ఆద్యా సాంగ్ సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈనెల 25న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీని విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Also Read : ల‌వ్లీ క్వీన్ తో ర‌వితేజ‌ లవ్

Leave A Reply

Your Email Id will not be published!