Shashi Tharoor : రాబోయే మార్పులకు నాంది : శశి థరూర్
అంతర్గత ప్రజాస్వామానికి గుర్తు
Shashi Tharoor : కాంగ్రెస్ ఎంపీ, రచయిత, తిరుగు బావుటా ఎగుర వేసిన నాయకుడు శశి థరూర్ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగుతున్న నవ సంకల్ప్ చింతన్ శివిర్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఆయన ఎక్కడికి వెళ్లినా హాట్ టాపిక్ గా మారడం, ఫోటోలు వైరల్ కావడం పరిపాటిగా మారింది. జీ23 గ్రూప్ నకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మేధోమథనం అంతర్గత ప్రజాస్వామ్యానికి బలమైన ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో చింతన్ శివిర్ కు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. ప్రస్తుతం అవి హల్ చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం
చింతన్ శివిర్ లో చివరి రోజు కు సిద్దమవుతున్న తరుణంలో రాజకీయ కమిటీలోని కొంతమంది సభ్యులతో గ్రూప్ ఫోటోను ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక అభిప్రాయాలు ఉద్వేగ భరితమైన చర్చల తర్వాత సామరస్య పూర్వక పరిష్కారాలు కనుగొనడం జరిగిందన్నారు శశి థరూర్.
ఈ చర్చలు అత్యంత ఫలప్రదమైన వాతావరణంలో జరగడం తనను సంతోషానికి గురి చేసిందని తెలిపారు. తన సహచరులతో ఫోటో దిగిన శశి థరూర్(Shashi Tharoor) తాజాగా మరో ఫోటోను పంచుకున్నారు.
మహిళా కాంగ్రెస్ ప్రతినిధులతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. జీ23 పేరుతో తిరుగుబాటు గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నారు శశి థరూర్(Shashi Tharoor). ప్రత్యేకంగా సదరు గ్రూపు పార్టీ పార్లమెంటరీ బోర్డును పునరుద్దరించాలని కోరుతోంది.
Also Read : అసోంలో వరదల బీభత్సం