Shashi Tharoor Mann : డియ‌ర్ కామ్రేడ్ ‘మాన్’ కంగ్రాట్స్ 

పంజాబ్ సీఎంకు శ‌శి థ‌రూర్ 

Shashi Tharoor : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు శ‌శి థ‌రూర్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. నిన్న జైపూర్ లో జ‌రిగిన బుక్ ఫెస్టివ‌ల్ లో పాల్గొన్న ఆయ‌న మోదీ ప‌నితీరుపై కితాబు ఇచ్చారు. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సన్నివేశానికి తెర తీశారు.

పార్టీ వేరైన‌ప్ప‌టికీ ఆమ్ ఆద్మీ  పార్టీకి చెందిన భ‌గ‌వంత్ మాన్ నిన్న‌టి దాకా ఎంపీగా  ఉన్నారు. శ‌శి థ‌రూర్ (Shashi Tharoor)తో మాన్ తో ద‌గ్గ‌రి అనుబంధం ఉంది.

తాజాగా పంజాబ్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓట‌మి చ‌వి చూసింది. ఆప్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ త‌రుణంలో ఎంపీగా ఉన్న భ‌గ‌వంత్ మాన్ ధురి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం పంజాబ్ ముఖ్య‌మంత్రిగా కొలువు తీర‌నున్నారు.

తాజాగా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న భ‌గ‌వంత్ మాన్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు శ‌శి థ‌రూర్. ఈ సంద‌ర్భంగా మాన్ తో తీసుకున్న సెల్ఫీని ఇవాళ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుతం శ‌శి థ‌రూర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా ఈనెల 16న స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ పుట్టిన ఖట్క‌ర్ క‌లాన్ లో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు ఆప్ సీఎం భ‌గ‌వంత్ మాన్.

ఇదిలా ఉండ‌గా మాన్ ను త‌మ పార్టీ వారు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నారంటూ పేర్కొన్నారు శ‌శి థ‌రూర్.

లోక్ స‌భ‌లో ఒకే బెంచ్ లో ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత భ‌గ‌వంత్ మాన్ తో ఆనందాన్ని పంచుకోవ‌డం త‌న‌కు ఆనందంగా ఉందంటూ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని ట్వీట్ చేయ‌డం విశేషం.

Also Read : మోదీ చ‌రిష్మా వ‌ల్లే యూపీలో గెలుపు

Leave A Reply

Your Email Id will not be published!