Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను రెడీ
అధికారికంగా ప్రకటించిన శశి థరూర్
Shashi Tharoor : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా ఆయన హల్ చల్ చేస్తూ వస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి తాను కూడా బరిలో ఉన్నానంటూ ప్రకటిస్తూ వచ్చారే కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేక పోయారు.
కానీ శనివారం శశి థరూర్ అధికారికంగా ప్రకటించారు తాను కాంగ్రెస్ చీఫ్ బరిలో ఉన్నట్లు. దీంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇక గాంధీ ఫ్యామిలీ నుంచి రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ ఉండగా నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి శశి థరూర్(Shashi Tharoor) ఇప్పటి వరకు కన్ ఫర్మ్ అయ్యింది.
మరో వైపు మధ్య ప్రదేశ్ నుంచి మాజీ సీఎం కమల్ నాథ్, భూపిందర్ హూడాతో పాటు పలువురు సీనియర్ నాయకులు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా మధుసూదన్ మిస్త్రీ ఉన్నారు. ఇవాళ తాను పూర్తి స్థాయిలో పోటీలో ఉంటానని శశి థరూర్ ప్రకటించడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.
మొత్తం పార్టీలో 9,000 వేల మంది సభ్యులున్నారు. చివరగా గాంధీయేతర ఫ్యామిలీ నుంచి సీతారాం కేసరి ఉన్నారు. 1998లో సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు.
ఇదిలా ఉండగా నామినేషన్ వేసేందుకు ఆను శశి థరూర్(Shashi Tharoor) ఫారమ్ ను తీసుకున్నారు. అధికారికంగా పోటీకి దిగిన మొదటి నాయకుడిగా నిలిచారు. ఎన్నికల కోసం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను అభ్యర్థించినట్లు తెలిపారు మిస్త్రీ.
మరో వైపు ఆయన గాంధీకి వీర విధేయుడిగా పేరొందిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది.
Also Read : జల్ బోర్డులో అవినీతిపై నివేదిక ఇవ్వండి